kcr: రైతు బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు
- ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ పథకం అమల్లోకి
- రైతులకు లబ్ధి చేకూర్చే అతిపెద్ద జీవిత బీమా పథకం
- సమీక్ష సమావేశంలో కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈరోజు రాత్రి ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, 636 కోట్ల రూపాయలతో 28 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు.
గ్రామ స్థాయిలో అర్హులైన రైతుల పేర్లు, వారికి సంబంధించిన వివరాలను వ్యవసాయ విస్తరణాధికారికి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ పథకం అమల్లోకి రానుందని, ఆ తర్వాత ఏ కారణం చేతనైనా అర్హుడైన రైతు మరణిస్తే, అతని కుటుంబానికి రూ.5 లక్షలు నిర్ణీత సమయంలో (పది రోజుల్లో)గా అందజేయాలని ఆదేశించారు.