komatireddy: చదువుకు.. విద్యార్హతకు తేడా ఉంది!: కోమటిరెడ్డి విద్యార్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • కోమటిరెడ్డి విద్యార్హతలపై పిటిషన్ వేసిన కంచర్ల భూపాల్ రెడ్డి
  • అఫిడవిట్ లో పేర్కొన్నది కరెక్టేనన్న ధర్మాసనం
  • బీఈ చదివారు, ఉత్తీర్ణత సాధించలేదంతేనంటూ పిటిషన్ కొట్టివేత

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో విద్యార్హతలను తప్పుగా పేర్కొన్నారంటూ కంచర్ల భూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. నిన్న పిటిషన్ ను విచారించిన జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ల ధర్మాసనం చదువుకు, విద్యార్హతకు గల తేడాను స్పష్టంగా తెలియజేసింది.

వాదనలు ప్రారంభం కాగానే భూపాల్ రెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ... కోమటిరెడ్డి తన విద్యార్హతను తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. ఆయన బీఈ చదివినట్టు పత్రికల్లో కూడా వచ్చిందని తెలిపారు. ఒక్క సబ్జెక్టు కూడా పాస్ కానివారు.... బీఈ చదివినట్టు చెప్పుకోవడం సరికాదని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... అఫిడవిట్ లో ఏం చదివారు? అని మాత్రమే ఉందని, విద్యార్హత ఏమిటని లేదుకదా? అని ప్రశ్నించింది. కోమటిరెడ్డి తన అఫిడవిట్ లో పేర్కొన్నది కరెక్టేనని... ఆయన బీఈ చదివారని, కానీ ఉత్తీర్ణత సాధించలేదంతేనని స్పష్టం చేస్తూ, పిటిషన్ ను కొట్టివేసింది.

  • Loading...

More Telugu News