KCR: కేసీఆర్ పై పోటీకి గద్దర్ ను దింపుతున్నాం!: కంచ ఐలయ్య

  • ఇప్పటికే గద్దర్ ను ఒప్పించాం
  • అరుణోదయ నాయకురాలు విమలక్కతో మాట్లాడుతున్నాం
  • బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యం: ఐలయ్య

వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై బడుగుల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్‌ ను రంగంలోకి దింపాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు టీ మాస్‌ చైర్మన్‌, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య వెల్లడించారు. 'బహుజనులకు రాజ్యాధికారం – ఉద్యోగుల పాత్ర' అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన, బహుజనులు అంగీకరిస్తే, కేసీఆర్ పై పోటీ చేసేందుకు గద్దర్ సిద్ధమని చెప్పారు.

అగ్రవర్ణ పాలకులు బడుగుల బతుకుదెరువును దూరం చేశారని, అందువల్లే ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో టీ మాస్‌ కూటమిని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ కమిటీ గ్రామగ్రామాల్లో పర్యటించనుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మహిళను సీఎంగా చేయడమే టీ మాస్ లక్ష్యమని వెల్లడించిన ఆయన, గద్దర్ ను ఇప్పటికే ఒప్పించామని, అరుణోదయ నాయకురాలు విమలక్కను కూడా ఎన్నికల్లో నిలిపేందుకు చర్చిస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ ప్రచారం చేసుకుంటున్న 'కేజీ టు పీజీ' పథకం ఆలోచన తనదేనని ఐలయ్య చెప్పారు.

  • Loading...

More Telugu News