Nobel: భారత సంతతి నోబెల్ విజేత నైపాల్ కన్నుమూత
- ఆయన వయసు 84 సంవత్సరాలు
- నైపాల్ తండ్రి భారత ఐఏఎస్
- ప్రపంచ వ్యాప్తంగా పర్యటించిన నైపాల్
- 2001లో నోబెల్ సాహిత్య పురస్కారం
నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత, భారత సంతతికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. నైపాల్ మరణించారన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వెస్టిండీస్ లోని ట్రినిడాడ్ లో జన్మించిన నైపాల్, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు.
నైపాల్ తండ్రి భారత్ కు చెందిన సివిల్ సర్వీసెస్ అధికారి. ఇంగ్లండ్ లో స్థిరపడిన నైపాల్, తన జీవితకాలంలో ఎక్కువ భాగం ప్రపంచ దేశాల పర్యటనల్లోనే గడిపారు. 2001లో నైపాల్ ను నోబెల్ సాహిత్య పురస్కారం వరించగా, 1971లో ఆయన రాసిన పుస్తకానికి బుకర్ ప్రైజ్ లభించింది. నైపాల్ మరణం పట్ల సాహితీలోకం తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది.