Tirumala: తిరుమల వెంకన్న అంశ దాగివున్నది ఈ పూర్ణకుంభంలోనే!
- అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు ప్రారంభం
- కలశాల్లోకి దేవతామూర్తుల శక్తి
- తిరుమలలో తగ్గిన భక్తుల సంఖ్య
కలియుగ వైకుంఠమైన తిరుమలలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు వైభవంగా ప్రారంభం కాగా, గర్భాలయంలోని స్వామివారి అంశను కలశంలోకి ఆవహించారు. రాత్రి 8 గంటల సమయంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది. ఆపై ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో ఉన్న దేవతామూర్తుల శక్తులను కలశాల్లోకి ఆవహించి, వాటిని యాగశాలకు తరలించారు. మహా సంప్రోక్షణపై భక్తులకు ముందుగానే అవగాహన కల్పించడంతో తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య తగ్గింది. నేడు యాగశాలలో కుంభానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, నేడు 35 వేల మందికి స్వామి దర్శనం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.