Indian Railways: 50 శాతం మహిళా రిజర్వేషన్ తో ఆర్పీఎఫ్ ఉద్యోగాలు!

  • త్వరలో 10 వేల ఉద్యోగాల భర్తీ
  • అందులో సగం ఉద్యోగాలు మహిళలకే
  • వెల్లడించిన కేంద్ర మంత్రి పీయుష్ గోయల్

ప్రపంచంలోనే అత్యధికులకు ఉపాధిని చూపిస్తున్న సంస్థగా గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వేస్ లో 10 వేల మంది ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) జవానుల రిక్రూట్ మెంట్ కు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండగా, ఇందులో 50 శాతం ఉద్యోగాలను మహిళలకు రిజర్వ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి పీయుష్ గోయల్ స్వయంగా వెల్లడించారు.

ఇండియన్ రైల్వేస్ లో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరగాల్సివుందని అభిప్రాయపడ్డ ఆయన, అందువల్లే రిజర్వేషన్ ప్రకటించామని తెలిపారు. ఇటీవలే దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి అందరూ మహిళలే నడిపే ఓ గూడ్స్ రైలుకు పచ్చజెండా ఊపామని ఆయన గుర్తు చేశారు. ఈ కొత్త రిక్రూట్ మెంట్ కంప్యూటర్ ఆధారిత టెస్టు ద్వారా ఉంటుందని ఆయన తెలిపారు.

కాగా, ఇండియన్ రైల్వేస్ లో ప్రస్తుతం 13.08 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఇంత అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చింది భారతీయ రైల్వేస్ మాత్రమే.

  • Loading...

More Telugu News