Alaska: అలాస్కాలో తీవ్ర భూకంపం... కిలోమీటర్ల మేర రెండుగా చీలిన భూమి!
- 6.4 తీవ్రతతో భూకంపం
- నార్త్ స్లోప్ కేంద్రంగా భూకంపం
- ఆపై పలు చిన్న చిన్న ప్రకంపనలు
అమెరికాలోని అలాస్కా రీజియన్ లో ఎన్నడూ చూడనంత తీవ్రతతో భూకంపం సంభవించగా, కిలోమీటర్ల దూరం పొడవునా భూమి రెండుగా చీలింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోగ్రాఫికల్ సర్వే విభాగం వెల్లడించింది.
దేశంలోని నార్త్ స్లోప్ కేంద్రంగా ఈ భూకంపం నమోదైందని తెలుస్తుండగా, ప్రాణ, ఆస్తి నష్టాలపై ఎటువంటి సమాచారం అందలేదు. ఈ రీజియన్ లో ఇదే అతిపెద్ద భూకంపమని అధికారులు అంటున్నారు. 1995లో 5.2 తీవ్రతతో వచ్చిన భూకంపమే అలాస్కా చరిత్రలో అతిపెద్దది. తాజా భూకంపం తరువాత పలుమార్లు స్వల్ప ప్రకంపనలు సంభవించాయి.