Suzuki Hayabusa: అదుపు తప్పిన సూపర్ బైక్ 'హయబుసా'... యువకుడి మృతి!

  • చిన్నకారు కన్నా ఎక్కువ పవర్
  • యాక్సిడెంట్ వేళ 200 కి.మీ. వేగంతో బైక్
  • గుర్గావ్ సమీపంలో ఘటన
సుజుకి హయబుసా... గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సత్తా ఉన్న హైఎండ్ లగ్జరీ బైక్. ఓ చిన్న కారుతో పోల్చి చూస్తే, అంతకన్నా ఎక్కువ పవర్ తో ఉంటుంది. అటువంటి బైక్ ప్రమాదానికి గురైతే... ఢిల్లీలోని గుర్గావ్ ప్రాంతంలో అదే జరిగింది. పవర్ ఫుల్ హయబుసాపై కుండ్లీ - మనేసర్ - పాల్వాల్ ఎక్స్ ప్రెస్ వేపై దూసుకెళుతున్న సంచిత్ ఓబెరాయ్ (25) అనే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అదుపు తప్పాడు. ఎదురుగా రివర్స్ లో వస్తున్న ఓ ట్రక్కును తప్పించే క్రమంలో పట్టుతప్పగా, ఆ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన సంచిత్ మరణించాడు.

ప్రమాదం జరిగిన సమయంలో బైకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ రహదారి విశాలంగా ఉండటంతో చాలా మంది ఔత్సాహిక యువకులు తమ హైఎండ్ బైకులతో దూసుకెళుతుంటారని, వారిని అదుపు చేసేందుకు చర్యలు చేపడుతున్నా, అప్పుడప్పుడూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు వ్యాఖ్యానించారు.
Suzuki Hayabusa
High Speed
Gurugram
Sanchit Oberai

More Telugu News