YSRCP: నిన్నేమీ మేం అడగలేదే... ఇస్తానన్న ఆయన్ను అడుగుతున్నాం: జగన్ పై ముద్రగడ నిప్పులు

  • కాపుజాతికి రిజర్వేషన్లు కావాల్సిందే
  • జగన్ సానుభూతి అక్కర్లేదు
  • మీడియాతో ముద్రగడ పద్మనాభం

తన కాపుజాతికి కావాల్సింది రిజర్వేషన్లే కానీ, సానుభూతి కాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కావని వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 "మాకు హామీ ఇచ్చారు. న్యాయమైంది. అమలు చేయండి అని అడుగుతున్నాం. మేమేమీ అడగలేదే. ఆయన్ను చేయమని అడగలేదే. చేస్తానని హామీ ఇచ్చిన మనిషిని అడుగుతున్నాం. అడుగుతుంటే, ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. రాజ్యాంగం ప్రకారం ఇవ్వడానికి వీల్లేదు. ఫిఫ్టీ పర్సంటే ఉంది... ఏం రాజ్యాంగం రాసేసినట్టు, రాజ్యాంగాన్ని చదివేసినట్టు మాట్లాడుతుంటే బాధేస్తోంది.

అసలు ఎవరు అడిగారు ఆయన్ను? అడక్కుండగానే నేను ఇవ్వను, ఆలోచన చేయను... ఎందుకు చెప్పాలి సార్?... ఆయనకు సంబంధం ఏంటి? అధికారంలో లేని మనిషి ఎందుకు మాట్లాడాల? మేము అడుక్కోలేదే... మా జాతి గురించి మేము అడుక్కోలేదే... అనవసరంగా మాట్లాడారు కాబట్టి, సమాధానం చెబుతున్నాం. ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అడుగుతున్నాం" అని అన్నారు.

  • Loading...

More Telugu News