ragging: సీనియర్ల వేధింపులు.. అనంతపురంలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య!

  • బస్సులోనూ వెంటపడి వేధించిన సీనియర్లు
  • మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువతి
  • ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదని తల్లిదండ్రుల ఆవేదన
ర్యాగింగ్ భూతానికి మరో ప్రాణం బలైంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక అనంతపురం జిల్లాలో ప్రియాంక అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆమె మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతోంది.

సీనియర్ల వేధింపులపై పలుమార్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినప్పటికీ కాలేజీ యాజమాన్యం నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా బస్సులో మరోసారి సీనియర్లు వేధించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రియాంక జుట్టుకు వేసుకునే సూపర్ వాస్మాల్ తాగి బలవన్మరణానికి పాల్పడింది.

కాగా కళాశాల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందనీ, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తమ కుమార్తెతో కలసి తాము గతంలో ఫిర్యాదు చేసినా కాలేజీ ప్రిన్సిపాల్ నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ragging
Anantapur District
engineering
student
suicide

More Telugu News