USA: అమెరికాకు మెక్సికో నుండి వలస వస్తున్న భారతీయులు!
- మెక్సికో నుంచి అమెరికాకు భారతీయుల వలస
- ఈ ఏడాది ఇప్పటి వరకు 4,197 మంది భారతీయుల అరెస్ట్
- ఇమ్మిగ్రేషన్ కేసుల వల్ల పౌర నిర్బంధంలో ఉన్న భారతీయులు
అమెరికాలో ఆశ్రయం కోరుతూ మెక్సికో నుంచి పలువురు వచ్చిపదిపోతున్న సంగతి విదితమే. అయితే, ఇలా వస్తున్న వేలాది మందిని ఇటీవల అమెరికా నిర్బంధించింది. అయితే ఇలా ఆశ్రయం కోరుతూ వస్తున్న వారిలో చాలా మంది భారతీయులే వున్నారు. మెక్సికోలో వేధింపులు భరించలేక అమెరికాలో ఆశ్రయం పొందటానికి వలస వస్తున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది.
మొత్తం మీద అమెరికా సరిహద్దుల్లో నిర్బంధంలోకి తీసుకున్న వారిలో భారతీయుల శాతం తక్కువే అయినా ఇటీవల సంవత్సరాల్లో వారి సంఖ్య పెరుగుతోందని వలససేవల అధికారులను, అటార్నీలను ఉద్దేశించి లాస్ఏంజెల్స్ టైమ్స్ వెల్లడించింది. 2018లో ఇప్పటివరకు సరిహద్దు సిబ్బంది అరెస్టు చేసిన వారిలో 4,197 మంది భారత జాతీయులనేని ఒక విశ్వవిద్యాలయం రూపొందించిన డేటాను తెలియజేసింది. ఇమ్మిగ్రేషన్ కేసులు పెండింగ్లో ఉన్నందువల్ల భారతీయులను నేరగాళ్ల హోదాలో కాకుండా పౌర నిర్బంధం కిందే ఉంచినట్లు తెలిపింది.
కాలిఫోర్నియాలోని విక్టర్విల్లే ఫెడరల్ కారాగారంలో ఆగస్టులో ఉన్న 680 మంది వలసదారుల్లో దాదాపు 380 మంది భారత జాతీయులేనని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ను ఉద్దేశించి పేర్కొంది. వీరు కాకుండా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు చెందిన ఇంపీరియల్ వ్యాలీ ఆవరణలో ఉన్న వారిలో 40 శాతం, అడెలాంటో ప్రాసెసింగ్ కేంద్రంలో నిర్బంధంలో ఉన్న వారిలో 20 శాతం మంది భారతీయులేనని పేర్కొంది.