Kathi Mahesh: కత్తి మహేశ్ నగర బహిష్కరణ కేసు విచారణ వాయిదా!
- నగర బహిష్కరణను హైకోర్టులో సవాల్ చేసిన కత్తి మహేశ్
- విచారణకు స్వీకరించిన హైకోర్టు
- కౌంటర్ దాఖలుకు 10 రోజులు గడువు కోరిన ప్రభుత్వం
- ఈనెల 27కు వాయిదా
శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో నగర బహిష్కరణకు గురైన సినీ విమర్శకుడు కత్తి మహేశ్, తనపై నగర బహిష్కరణ ఎత్తివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే వివాదంలో నగర బహిష్కరణకు గురైన పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశించిన నేపధ్యంలో కత్తి మహేశ్ కూడా నగర బహిష్కరణ ఎత్తివేయాలని హైకోర్టును కోరారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దీనికి 10 రోజుల సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరటంతో, ఈ కేసును హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.