Indira Gandhi: ఎడ్లబండిలో పార్లమెంటుకు వాజ్‌పేయి.. ఇందిర ప్రభుత్వంపై నిరసన!

  • పెట్రోలు, కిరోసిన్ ధరలను పెంచిన ఇందిర ప్రభుత్వం
  • గుర్రపు బగ్గీపై పర్యటించి అవగాహన కల్పించిన ఇందిర
  • నిరసనగా ఎడ్లబండిపై వచ్చిన వాజ్‌పేయి

అటల్ బిహారీ వాజ్‌పేయి 1973లో ఎడ్లబండిలో పార్లమెంటుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం పెట్రోలు, కిరోసిన్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఆయన ఎడ్లబండిలో పార్లమెంటుకు చేరుకున్నారు. అంతకుముందు రోజే ఇందిరాగాంధీ గుర్రపు బగ్గీపై ఢిల్లీలో పర్యటించి పెట్రోలు వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇంధన వాడకాన్ని తగ్గించి సహకరించాలని కోరారు.

ఆ తర్వాతి రోజే వాజ్‌పేయి ఇలా ఎద్దులబండిపై పార్లమెంటుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పార్లమెంటుకు ఇలా రావడం బహుశా ఇదే తొలిసారి. ఆ తర్వాత వాజ్‌పేయిని చాలామంది నేతలు అనుసరించారు. ఇప్పటికీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది. ధరల పెరుగుదల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలకు ఇలా రావడం నేతలకు పరిపాటిగా మారింది.

  • Loading...

More Telugu News