Incometax: గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో ఆదాయపుపన్ను వసూళ్లు!
- 2017-18లో ఆదాయపు పన్ను వసూళ్లు రూ.10 లక్షల కోట్లు
- 2017-18లో 6.92 కోట్ల రిటర్నుల దాఖలు
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.25 కోట్ల మందిని జత చేర్చాలన్న యత్నం
2017-18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.10.03 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఆదాయపు పన్ను వసూళ్లు ఇలా రికార్డు స్థాయిలో వచ్చాయని ఇన్ కమ్ టాక్స్
తూర్పు జోన్ నిర్వహణాధికారుల సమావేశంలో పాల్గొన్న సీబీడీటీ సభ్యురాలు శబ్రి భట్టాశాలి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6.92 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని, 2016-17లో దాఖలైన రిటర్నులతో పోలిస్తే ఇవి 1.31 కోట్లు అధికమని వివరించారు.
2017-18లో కొత్తగా 1.06 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేశారు. కాబట్టే రికార్డ్ స్థాయిలో ఆదాయపు పన్ను వసూలయ్యిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 కోట్ల మందిని కొత్తగా చేర్చాలన్నది ఆదాయపు పన్ను శాఖ యత్నం. ఇందులో ఈశాన్య ప్రాంతం నుంచే 1.89 లక్షల మందిని చేర్చాలన్నది ప్రయత్నం. వీరంతా కూడా ఆదాయపుపన్ను చెల్లిస్తే ఈ ఆర్ధికసంవత్సరం కూడా రికార్డ్ స్థాయిలో ఆదాయపుపన్ను వసూళ్లు జరిగే అవకాశం వుంటుంది.