Andhra Pradesh: నిరుద్యోగ యువత కోసమే పనిచేస్తున్నాం.. శ్రీసిటిలో నారా బ్రాహ్మణి వ్యాఖ్య!

  • శ్రీసిటిలో ఎన్టీఆర్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం
  • ఇప్పటివరకూ 12 వేల మందికి ఉపాధి కల్పించామన్న బ్రాహ్మణి
  • ఇప్పటికే హైదరాబాద్, వినుకొండలో రెండు స్కిల్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి శ్రీసిటీ పారిశ్రామిక నగరంలో పర్యటించారు. శ్రీసిటీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఎన్టీఆర్ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ట్రస్ట్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్ తో పాటు గుంటూరు జిల్లాలోని వినుకొండలో రెండు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. తాజాగా శ్రీసిటీలో మూడో సెంటర్ ను ప్రారంభించామని పేర్కొన్నారు. కనీసం 8వ తరగతి, ఆపై చదువుకున్న వారికి వేర్ హౌస్ ప్యాకేజింగ్, మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో హెరిటేజ్, శ్రీ టెక్నాలజీస్ భాగస్వాములు అయినట్లు వెల్లడించారు. గత 8 ఏళ్లలో దాదాపు 12,000 మందికి ఉపాధి కల్పించామని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News