kesav prasad maurya: లోక్ సభలో పాస్ అవుతుంది.. రాజ్యసభలో ఓడిపోతుంది!: రామ మందిర చట్టంపై బీజేపీ నేత

  • రామ మందిర నిర్మాణానికి చట్టం తీసుకురావాలి
  • రాజ్యసభలో బలం లేకపోవడం వల్ల.. బిల్లు పాస్ కాదు
  • బలం సాధించిన తర్వాత.. అవకాశాన్ని వదులుకోబోము

లోక్ సభలో బీజేపీకి తగినంత మెజార్టీ ఉందని... రాజ్యసభలో కూడా తగినంత బలం సంపాదిస్తే అయోధ్య రామ మందిర నిర్మాణానికి చట్టం తీసుకొస్తామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. తప్పని పరిస్థితుల్లో చట్టం తీసుకురావడం తప్ప మరో దారి లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోక్ సభలో ఈ బిల్లు పాస్ అయినా... రాజ్యసభలో ఆ బిల్లు కచ్చితంగా ఓడిపోతుందని ఆయన చెప్పారు. ఈ విషయం ప్రతి రామ భక్తుడికి తెలుసని అన్నారు.

ఉభయసభల్లో మెజార్టీ వచ్చినప్పుడు... దాన్ని తాము కచ్చితంగా వినియోగించుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాన్ని దుర్వినియోగం చేయబోమని కేశవ్ ప్రసాద్ తెలిపారు. రామ మందిర నిర్మాణం పూర్తయితేనే అశోక్ సింఘాల్, మహంత్ శ్రీ రామచంద్ర దాస్ పరమహంసతో పాటు బలిదానాలు చేసిన కరసేవకులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News