WhatsApp: ఇకపై వాట్సాప్ యూజర్లకు అపరిమితంగా బ్యాకప్ మెమొరీ!

  • అపరిమితంగా బ్యాకప్ చేసుకోండి అంటూనే కాలపరిమితి విధించిన వాట్సాప్
  •  గూగుల్ తో కుదిరిన ఒప్పందంలో అపరిమిత వాట్సాప్ బ్యాకప్
  •  సంవత్సరం తరువాత ఆటోమాటిక్ గా తొలగిపోనున్న బ్యాకప్ డేటా

ఉదయం లేవగానే మొదట చూసేది మొబైల్ ... అందులో వాట్సాప్.. గుడ్ మార్నింగ్ నుండి మొదలుపెట్టి గుడ్ నైట్ వరకు ప్రతి రోజు వాట్సాప్ లో వస్తున్న మెసేజ్ లతో మెమరీ ప్రాబ్లమ్... అయితే బ్యాకప్ మెమొరీ విషయంలో తాజాగా వాట్సాప్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే బ్యాకప్ కి సంబంధించిన బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది.

ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బ్యాకప్ మెమొరీ అపరిమితం కానుంది. ఇప్పటి వరకు వాట్సాప్ యూజర్లు తమ మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలను పరిమితంగా స్టోర్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అపరిమితంగా బ్యాకప్ చేసుకోవచ్చు. అసలు గూగుల్ డ్రైవ్‌లో 15 జీబీ డేటానే లభిస్తుంది. వాట్సాప్ ను ఇందులో బ్యాకప్ చేసుకుంటే అంత మెమొరీ తగ్గిపోతుంది కానీ వాట్సాప్, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందంలో వాట్సాప్ బ్యాకప్ ను గూగుల్ డ్రైవ్ పరిగణనలోకి తీసుకోదు. అంటే అపరిమితమైన వాట్సాప్ బ్యాకప్ చేసుకోవచ్చు అన్నది గుడ్ న్యూస్.

అయితే దీనితో పాటు దీనికి లింక్ గా బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది. ఇంతకు ముందువరకు వాట్సాప్ బ్యాకప్ ను ఎన్నాళ్లు అయినా నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఇప్పటి నుండి వాట్సాప్ ఆ వెసులుబాటును తొలగించి దానిని ఏడాదికే పరిమితం చేసింది. ఏడాది తర్వాత డ్రైవ్‌లో ఉన్న డేటా దానంతట అదే డిలీట్ అయిపోతుంది. ఈ ఏడాది నవంబరు12నుండి ఇది అమలవుతుంది. కాబట్టి యూజర్లు వాట్సాప్ కి సంబంధించి అవసరమైన డేటా ఉంటే గూగుల్ డ్రైవ్ లో కాక వేరే చోట భద్రపరుచుకోవడం మేలు. అపరిమితంగా బ్యాకప్ చేసుకోండి అంటూనే కాలపరిమితి విధించి ట్విస్ట్ పెట్టింది వాట్సాప్. 

  • Loading...

More Telugu News