Hens: రెట్టలేసి ఇళ్లను పాడుచేస్తున్న కోళ్లు.. డైపర్లు వేసి మరీ పెంచుకుంటున్న యజమానులు!

  • ఇల్లంతా రెట్టలు వేసి పాడు చేస్తున్న కోళ్లు 
  • డైపర్లు వేసి తిప్పుతున్న యజమానులు
  • పుంజుకుంటున్న కోళ్ల డైపర్ల వ్యాపారం

అమెరికాలో కోళ్లు ఇప్పుడు డైపర్లతో తిరుగుతున్నాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లను పెంచడం ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారింది. అయితే, ఎటొచ్చీ వీటితో ఓ చిక్కొచ్చి పడింది. రెట్టలేసి ఇల్లంతా గలీజు చేస్తున్నాయట. దీంతో తీవ్రంగా ఆలోచించిన కోళ్ల యజమానులు చక్కని ఉపాయం ఆలోచించారు. కోళ్లకు డైపర్లు వేసి ఆ గండం నుంచి గట్టెక్కుతున్నారు. దీంతో ఇప్పుడు అక్కడ ఏ కోడిని చూసినా డైపర్లతో కనిపిస్తున్నాయి. ఇప్పుడీ కోళ్ల డైపర్ల వ్యాపారం కూడా పుంజుకుంది. డైపర్లు తయారు చేస్తున్న న్యూహాంప్‌షైర్‌కు చెందిన జూలీ బేకర్‌ డైపర్లు అమ్ముతూ ఏడాదికి రూ.40 లక్షల దాకా వెనకేసుకుంటోంది.

గతంలో యూట్యూబ్‌లో ఎవరో కోడికి సరదాగా డైపర్ తొడిగిన వీడియోను చూసిన జూలీకి చప్పున ఓ ఆలోచన స్ఫురించింది. వాటిని తానే తయారుచేయాలని నిర్ణయించింది. ‘పేంపర్డ్‌ పౌల్ట్రీ’ పేరుతో విక్రయాలు ప్రారంభించింది. నెమ్మదిగా ప్రారంభమైన విక్రయాలు ఇప్పుడు ఊపందుకోవడంతో త్వరలోనే కోళ్లకు డ్రెస్‌లు తయారు చేసే ఆలోచన కూడా చేస్తోందట జూలీ.

  • Loading...

More Telugu News