Amaravati: అమరావతిలో రెడ్ అలర్ట్... కొండవీటి వాగు వద్ద పోలీసుల పహారా!
- అమరావతి గుండా ప్రవహిస్తున్న కొండవీటి వాగు
- భారీ వర్షాలకు పెరుగుతున్న వరద
- ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను ఎత్తిన అధికారులు
నిన్నటి నుంచి గుంటూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అమరావతి ప్రాంతం గుండా ప్రవహిస్తున్న కొండవీటి వాగుకు వరద పెరుగుతూ ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాగు ఉప్పొంగితే, వచ్చే వరద నీరు సెక్రటేరియేట్ వైపు వచ్చే ప్రమాదం ఉండటంతో తాడికొండ పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా, వర్ష ఉద్ధృతి అధికంగా ఉండటంతో నేడు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అధికమవుతుండటంతో 70 గేట్లనూ ఎత్తేసి, 65 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు మరింత వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విజయవాడలో ఎడతెరిపిలేని వర్షాలకు వన్ టౌన్, బందర్ రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్, జమ్మిచెట్టు సెంటర్ తదితర ప్రాంతాల్లోకి నీరు చేరింది.