Asian Games: 'బజరంగ్' పట్టుకు ఫిదా అయిన వైఎస్ జగన్.. గ్రీటింగ్స్!

  • ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం సాధించిన పునియా
  • కుస్తీ పోటీల్లో ఉడుం పట్టు పట్టిన పునియా
  • ట్విట్టర్ లో జగన్ అభినందనలు
ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు స్వర్ణాన్ని అందించిన రెజ్లర్ బజరంగ్‌ పునియా పట్టుకు వైకాపా అధినేత వైఎస్ జగన్ ఫిదా అయ్యారు. ఫైనల్లో ఉడుంపట్టు పట్టిన పునియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, జగన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఇండియాకు తొలి స్వర్ణ పతకాన్ని పునియా సాధించడం తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు. షూటింగ్ మిక్సెడ్ డబుల్స్ విభాగంలో కాంస్యం సాధించిన అపూర్వీ చండేలా, రవికుమార్ జోడీకి కూడా ఆయన శుభాభినందనలు తెలిపారు. భారత ఆటగాళ్లు పతకాల వేటలో మరింతగా రాణించాలని కోరుకుంటున్నట్టు జగన్ తెలిపారు.
Asian Games
Jagan
Punia
Gold Medal

More Telugu News