Kerala: కేరళ వరద బాధితులకు సైనికుల సతీమణుల సాయం
- నిత్యావసర వస్తువులను పంపిన జవాన్ల సతీమణులు
- 12 ట్రక్కుల్లో తీసుకెళ్లిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్
- మానవత్వాన్ని చాటుకున్న సీఆర్పీఎఫ్ జవాన్ల సతీమణుల సంఘం
ఆపదలో వున్నప్పుడు సహాయం చెయ్యటం మానవత్వానికి నిదర్శనం. అలాంటి మానవత్వాన్ని చాటుకున్నారు తమిళనాడులోని కోయంబత్తూర్ లోని సీఆర్పీఎఫ్ సతీమణుల సంక్షేమ సంఘం సభ్యులు. కేరళ వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. సీఆర్పీఎఫ్ సతీమణుల సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను సేకరించి కేరళకు పంపింది.
వరద బాధితుల కోసం నిత్యావసర వస్తువులు, దుస్తులు, మందులు, శానిటరీ వస్తువులను 12 ట్రక్కుల్లో నింపి పంపారు సీఆర్పీఎఫ్ జవాన్ల సతీమణులు. వీటిని త్రిస్సూర్, చలక్కూడి ప్రాంతాల్లో బాధితులకు అందించడానికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లింది.