Asian Games: వ్యభిచార గృహాలకు వెళ్లిన ఆటగాళ్లు.. వేటు వేసిన జపాన్

  • వ్యభిచారులతో గడిపిన జపాన్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు
  • వేటు వేసి, స్వదేశానికి పంపిన జపాన్ ఒలింపిక్ కమిటీ
  • వ్యభిచార గృహాలకు వెళ్లడం సిగ్గుచేటన్న జపాన్ అధికారి

ఇండొనేషియా రాజధాని జకార్తాలో ఆసియా క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆటపై దృష్టి సారించి, దేశానికి పతకం సాధించి పెట్టాల్సిన ఆటగాళ్లు కొందరు... పక్కదారి పడుతున్నారు. జపాన్ కు చెందిన నలుగురు బాస్కెట్ బాల్ ప్లేయర్లు సమీపంలో ఉన్న రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారు. గత గురువారంనాడు రాత్రి 10 గంటలకు క్రీడాగ్రామం నుంచి బయటకు వచ్చిన వీరు మద్యం తాగి, భోజనం చేశారు. ఆ తర్వాత వ్యభిచారులతో గడిపారు.

ఈ విషయం తెలుసుకున్న జపాన్ ఒలింపిక్ కమిటీ వారిపై కఠిన చర్యలు తీసుకుంది. వారిపై వేటు వేసి, స్వదేశానికి పంపించేసింది. తమ ఆటగాళ్ల తీరు పట్ల జపాన్ ఒలింపిక్ కమిటీ క్షమాపణలు కూడా చెప్పింది. బాస్కెట్ బాల్ ప్లేయర్లు వ్యభిచార గృహాలకు వెళ్లడం సిగ్గుచేటని జపాన్ కు చెందిన ఓ అధికారి అన్నారు.

  • Loading...

More Telugu News