Rahul Gandhi: ఆ సాయం ఏమాత్రం ..కేరళకు 2 వేల కోట్లు ఇవ్వండి: రాహుల్ గాంధీ

  •  కేరళకు మీరిచ్చిన నిధులు సరిపోవన్న రాహుల్ గాంధీ
  •  నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఎంతోకాలం పడుతుంది 
  •  సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపు

వరదలతో అతలాకుతలమైన కేరళకు ప్రధాని ప్రకటించిన ఆర్థిక సాయం ఏ మాత్రం సరిపోదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2 వేల కోట్ల నిధులు ఇస్తే కేరళ కోలుకునే అవకాశం ఉందన్న రాహుల్, ప్రస్తుత విపత్తు నుంచి కేరళను కాపాడటానికి ప్రధాని ఆలోచించాలని, రాష్ట్రానికి బాసటగా నిలవాలని సూచించారు.  
 
 కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ప్రకటించడం అభినందనీయమే కానీ.. ఆ నిధులు సరిపోవని రాహుల్ అన్నారు. 'డియర్ మోదీజీ.. కేరళ పరిస్థితిని చూసి మీరు తక్షణ సాయం కింద రూ.500 కోట్లు అందించడం బాగానే ఉంది. కానీ ఆ నిధులు ఏమాత్రం చాలవు. ఇప్పటికే దాదాపు రూ.19,500 కోట్ల నష్టం జరిగిందని విన్నాను. ఆ నష్టం పూడడానికి ఎంతోకాలం పడుతుంది. మీరు ఈ విషయంలో కేరళకు అండగా నిలుస్తారని అనుకుంటున్నాను. కేరళ ప్రభుత్వం కోరిన రూ.2,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వడంలో మీరెందుకంత ఆలోచిస్తున్నారు?. కేరళ ప్రజలకు తగిన న్యాయం చేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు సూచిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్లు చేశారు.  

  • Loading...

More Telugu News