yadlapati: పెద్దాయనా.. మీ పుట్టిన రోజుకు నేను తప్పకుండా వస్తా!: యడ్లపాటికి మాటిచ్చిన సీఎం చంద్రబాబు

  • సీఎంను కలుసుకున్న సీనియర్ టీడీపీ నేత యడ్లపాటి
  • పెద్దాయన ఆరోగ్యంపై వాకబు చేసిన చంద్రబాబు
  • జీవితాంతం తాను, పార్టీ యడ్లపాటికి రుణపడి ఉంటామని వ్యాఖ్య

తెలుగుదేశం సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు(99) ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి ఆయన రాగానే చంద్రబాబు స్వయంగా ఎదురువెళ్లి వెంకట్రావును ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మీ లాంటి నిస్వార్థ నాయకులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ, తాను జీవితాంతం మీకు రుణపడి ఉంటామని బాబు వెంకట్రావుతో అన్నారు.

ఈ ఏడాది డిసెంబర్ 16న జరిగే తన 100వ జన్మదిన వేడుకలకు రావాలని వెంకట్రావు చంద్రబాబును ఆహ్వానించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘మీ ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి. మీ వందో పుట్టిన రోజుకు తప్పకుండా వస్తా’ అని బాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మళ్లీ ఏపీ సీఎంగా చంద్రబాబే గెలుస్తారన్న నమ్మకం తనకుందని యడ్లపాటి వెంకట్రావు వ్యాఖ్యానించారు. యడ్లపాటి వెంట ఆయన కుటుంబ సభ్యులు వచ్చారు.

  • Loading...

More Telugu News