chiranjeevi: చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు.. ఎవరెవరు ఏం చెప్పారంటే..!
- స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలన్న నాగ్, వెంకీ
- లవ్యూ మామా అన్న సాయి ధరమ్
- అందరికీ ఇలాగే స్ఫూర్తిదాయంగా నిలవాలన్న కొరటాల శివ
ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరెవరు ఏ విధంగా స్పందించారో చూడండి.
నాగార్జున: ప్రియమైన చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
వెంకటేష్: నా స్నేహితుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
రాధిక: నా ప్రియ మిత్రుడు, సహనటుడు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరొక రాక్ స్టార్. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి.
అల్లు అర్జున్: ఏకైక మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
శ్రీకాంత్: హ్యాపీ బర్త్ డే అన్నయ్యా. మీకు ఎంతో ప్రత్యేకమైన ఈరోజు సుఖ సంతోషాలతో నిండిపోవాలి.
కొరటాల శివ: మా మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే అందరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి.
హరీష్ శంకర్: మెగాస్టార్ కు హ్యాపీ బర్త్ డే. ఎన్నో మంచి సినిమాలు అందిస్తూ, మాలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ, మాకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేస్తున్నారు. లవ్యూ సార్.
సుధీర్ బాబు: ఈ రోజుతో మెగాస్టార్ వయసు మరో సంవత్సరం తగ్గింది. మా యంగ్ బ్రదర్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు.
వరుణ్ తేజ్: నా స్ఫూర్తిదాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
సాయి ధరమ్ తేజ్: లవ్యూ మామా. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్. మీరు మాకు పంచిన ప్రేమ, స్ఫూర్తి ఎంతో గొప్పవి.
శ్రీను వైట్ల: మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు ఇంకా గొప్పగా ఉండాలి సార్.
వంశీ పైడిపల్లి: మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రయాణం మాకెంతో స్ఫూర్తిదాయకం.