NASA: ఇటీవలి వర్షపాతంపై శాటిలైట్ డేటాతో వీడియో విడుదల చేసిన నాసా!
- దేశంలో కురిసిన వర్షాలపై వీడియో రిలీజ్ చేసిన నాసా
- ప్రతి అరగంటకు వర్షాలకు సంబంధించిన డేటా పంపుతున్న నాసా శాటిలైట్
- ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న వర్షపాతం ఎంతో తెలుసుకునే అవకాశం
అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం 'నాసా' తన శాటిలైట్ ద్వారా సేకరించిన డేటాను క్రోడీకరించి, గత వారం ఇండియాలోని వర్షపాతంపై ఓ వీడియోను విడుదల చేసింది. ఆగస్ట్ 13 నుండి 20 వరకు భారతదేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసినట్టు ఇందులో ప్రకటించింది. ముఖ్యంగా దేశంలోని పశ్చిమప్రాంతంలో భారీ వర్షాలు కురిసినట్టు ఈ డేటా వల్ల తెలుస్తోంది. మొత్తానికి కేరళ, కర్ణాటకలలో పడిన వర్షాలపై అధికారులు ఓ అంచనాకు రావడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. మామూలుగా వాతావరణ డేటాను నాసా ప్రతి అరగంటకోసారి పంపిస్తుంది. ఈ డేటా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎంత వర్షపాతం నమోదయ్యిందో తెలుసుకునే అవకాశం కలుగుతుంది.