Teaser: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘స్త్రీ’ చిత్రం పాట.. కృతి సనన్ డ్యాన్స్!
- అస్థిపంజరంతో కృతిసనన్ డ్యాన్స్
- ఆకట్టుకుంటున్న ‘ఆవో కభీ హవేలీ పే’ పాట
- ఈ నెల 31న సినిమా విడుదల
అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాజ్కుమార్రావ్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘స్త్రీ’ చిత్రంలోని ఓ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. బాద్షా, నికితా గాంధీ, సచిన్-జిగర్లు పాడిన ‘ఆవో కభీ హవేలీ పే’ పాట విజువల్స్ ను తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో కృతి సనన్ డ్యాన్స్ చేసింది. ఓ అస్థిపంజరం వీణ వాయిస్తుండడం, కళ్లద్దాలు పెట్టుకుని పోజులివ్వడం, దెయ్యంలా నిద్రపోతున్న కృతిసనన్ లేవడం, ఆ తర్వాత అస్థిపంజరంతో కలిసి మద్యం సేవిస్తూ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
మధ్యప్రదేశ్ చందేరీ ప్రాంతంలోని ఓ బూత్ బంగ్లాలో ఈ పాటను చిత్రీకరించారు. ‘ఓ ఊరిలో హఠాత్తుగా పురుషులు మాయమైపోతుంటారు. వారు మాయమైన చోట వారి దుస్తులు మాత్రమే లభిస్తాయి. ఇలా పురుషులు మాయమైపోవడానికి ఒకామె కారణమని భావించిన గ్రామస్థులు ఓ ‘స్త్రీ’ని అనుమానిస్తారు. ఇంతకీ ఆ ‘స్త్రీ’ ఎవరన్నదే చిత్ర కథనం. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హర్రర్ కామెడీ చిత్రంలోని ‘స్త్రీ’ పాత్రలో శ్రద్ధాకపూర్ నటించింది. ఈనెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.