Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్.. సరికొత్త రికార్డు సృష్టించిన నేత!

  • కశ్మీర్ 13వ గవర్నర్ గా ఈరోజు బాధ్యతలు
  • గతంలో బిహార్ గవర్నర్ గా పనిచేసిన మాలిక్
  • పేద రైతు కుటుంబంలో పుట్టి గవర్నర్ స్థాయికి

జమ్మూకశ్మీర్ 13వ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్(71) ఈ రోజు ప్రమాణ స్వీకారం  చేశారు. కశ్మీర్, బిహార్, మేఘాలయ సహా 7 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రెండు రోజుల క్రితం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించిన సంగతి తెలిసిందే. తాజా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో జమ్మూకశ్మీర్ కు గవర్నర్ గా నియమితులైన తొలి రాజకీయ నేతగా మాలిక్ చరిత్ర సృష్టించారు.

జమ్మూకశ్మీర్ కు ముందు మాలిక్ బిహార్ గవర్నర్ గా పనిచేశారు. 1989-1991 మధ్యకాలంలో ఆయన అలీగఢ్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. అలాగే రాజ్యసభకు రెండు సార్లు ఎన్నికైన మాలిక్ గతంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. మాలిక్ కు ముందు ఎన్ఎన్ వోహ్రా పదేళ్ల పాటు రాష్ట్ర గవర్నర్ గా సేవలు అందించారు. ఉత్తరప్రదేశ్ లో ఓ పేదరైతు కుటుంబంలో 1946, డిసెంబర్ 25న జన్మించిన మాలిక్.. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News