trends: ‘ట్రెండ్స్’ బ్రాండ్ అంబాసిడర్ గా కీర్తి సురేష్

  • తమిళనాడుతో పాటు దక్షిణాదిలో ప్రచారకర్తగా కీర్తి 
  • రిలయన్స్ సంస్థ  ప్రకటన 
  • ‘ట్రెండ్స్’ కు దేశ‌ వ్యాప్తంగా మంచి స్పంద‌న: కీర్తి సురేశ్

రిలయన్స్ రిటైల్‌లో దుస్తులు, ఉప‌క‌ర‌ణాల‌ ప్ర‌త్యేక విభాగమైన ట్రెండ్స్‌.. తమ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ‘మహానటి’ కీర్తి సురేష్ ను నియ‌మించుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ సంస్థ ఓ ప్రకటనలో వెల్ల‌డించింది. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కీర్తి సురేష్ ‘ట్రెండ్స్’కు ప్రచారకర్తగా వ్యవహరిస్తారని పేర్కొంది. ఈ కార్య‌క్ర‌మం చెన్నైలోని వీఆర్ మాల్ ట్రెండ్స్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో ఈరోజు జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కీర్తి సురేష్ పై ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక శాండ్ ఆర్ట్ ప్ర‌ద‌ర్శన ఆక‌ట్టుకుంది. అక్టోబర్ నుంచి తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కీర్తి సురేష్ వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నట్లు పేర్కొంది.

‘ట్రెండ్స్‌’తో క‌లిసి ప‌నిచేయ‌టం సంతోషం: కీర్తి సురేష్

‘ఫ్యాష‌న్‌, ట్రెండ్స్ ఈ రెండింటినీ వేర్వేరుగా చూడ‌లేం. ‘ట్రెండ్స్’ బ్రాండ్‌కు దేశ‌ వ్యాప్తంగా వినియోగ‌దారుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇక్క‌డ సామాన్య ధ‌ర‌ల‌కే అద్భుత‌మైన ఫ్యాష‌న్స్‌ అందుబాటులో ఉన్నాయి. భార‌త‌దేశ‌పు అతిపెద్ద ఫ్యాష‌న్ కేంద్రంగా ‘ట్రెండ్‌’ను పేర్కొన‌డం అతిశ‌యోక్తికాదు. ప్ర‌పంచ ఫ్యాష‌న్ రంగంలో వ‌చ్చే ఎలాంటి ట్రెండ్‌నైనా.. ‘ట్రెండ్స్’ అందిస్తుంది. బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ‘ట్రెండ్స్‌’తో క‌లిసి ప‌నిచేయ‌టం సంతోషంగా ఉంది. ట్రెండ్స్‌లో అందుబాటులో ఉన్న దుస్తులు,  అన్ని ఫ్యాష‌న్ ఉత్ప‌త్తులూ ప్ర‌త్యేకంగా ఉన్నాయి. ఇవ‌న్నీ అంత‌ర్జాతీయ ట్రెండ్స్‌కు అనుగుణంగా ఉన్నాయి. గెట్ దెమ్ టాకింగ్ పేరుతో ప్రారంభించిన ఈ ప్ర‌చారం న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది’ అని కీర్తి సురేష్ అన్నారు.
 
ఫ్యాష‌న్ ప్రియులు కోరుకుంటున్న కేంద్రం ‘ట్రెండ్స్’:  సీఓఓ విపిన్ త్యాగి

‘ట్రెండ్స్ నేడు భార‌త‌దేశంలో ఎక్కువ‌ మంది ఫ్యాష‌న్ ప్రియులు కోరుకుంటున్న కేంద్రం. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలు ట్రెండ్స్ ఫ్యాష‌న్ కేంద్రంగా మారాయి. కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్ర‌జ‌లలు, ఫ్యాష‌న్ ప్రియుల‌ నుంచి ‘ట్రెండ్స్‌’కు అనూహ్యమైన స్పంద‌న వ‌స్తోంది. దీనికి అనుగుణంగానే భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సేవ‌లందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వినియోగ‌దారుల‌తో మ‌రింత సుస్థిర అనుబంధం ఏర్ప‌ర్చుకొన‌టంలో కీర్తి సురేష్ తో క‌లిసి ముందుకెళ్ల‌టం దోహ‌ద‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాం’ అని విపిన్ త్యాగి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News