asian games: ఏషియన్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం.. రోయింగ్ లో సత్తా చాటిన యువ జట్టు

  • రోయింగ్ క్వాడ్రఫుల్ ఈవెంట్ లో స్వర్ణం
  • డబుల్ స్కల్స్ పోటీలో కాంస్యం
  • ఇప్పటివరకూ 21 పతకాలు గెలుచుకున్న భారత్
ఇండోనేషియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో శుక్రవారం భారత జట్టు సత్తా చాటింది. రోయింగ్ క్వాడ్రఫుల్ పురుషుల స్కల్స్ విభాగంలో సవర్ణ్ సింగ్, ఓం ప్రకాశ్, సుఖ్మిత్ సింగ్ జట్టు అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ పోటీలో ఇండోనేషియా, థాయ్ లాండ్ జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

రోయింగ్ లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ ఈవెంట్ లోనూ భారత జట్టుకు కాంస్యం లభించింది. రోహిత్ కుమార్, భవవాన్ దాస్ జట్టు ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకుంది. ఏషియన్ గేమ్స్ లో భారత జట్టు ఇప్పటివరకూ 5 స్వర్ణం, నాలుగు రజతం, 12 కాంస్య పతకాలను(మొత్తం 21) గెలుచుకుంది.
asian games
indonesia

More Telugu News