Hyderabad: హైదరాబాద్ లో సూపర్ మార్కెట్లపై అధికారుల కొరడా.. 23 కేసుల నమోదు!

  • తనిఖీలు చేపట్టిన తూనికలు, కొలతల శాఖ
  • పాత జీఎస్టీ రేటును వసూలుచేస్తున్న మాల్స్
  • కేసు నమోదుచేసిన అధికారులు

హైదరాబాద్ లో వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ పై తూనికలు, కొలతల శాఖ అధికారులు ఈ రోజు దాడులు నిర్వహించారు. మాదాపూర్ నుంచి దిల్ సుఖ్ నగర్ వరకూ ఉన్న షాపుల్లో 16 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న పలు మాల్స్ పై కేసులు నమోదు చేశారు.


వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను కేంద్రం తగ్గించినప్పటికీ చాలాచోట్ల పాత రేట్లనే వసూలు చేయడాన్ని అధికారులు గుర్తించారు. మణికొండ, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, మియాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు ఈ రోజు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన మాల్స్ పై అధికారులు 23 కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News