paruchuri: చిరూ సినిమాల్లో ఈ డైలాగ్స్ బాగా పాప్యులర్ అయ్యాయి: పరుచూరి గోపాలకృష్ణ
- 'ఖైదీ'లో ఆ డైలాగ్ బాగా పేలింది'
- 'గ్యాంగ్ లీడర్'లో ఆ డైలాగ్ కి క్లాప్స్ పడ్డాయి
- 'ఠాగూర్' లోని ఆ డైలాగ్ నాకే బాగా నచ్చేసింది
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను సంభాషణలను అందించిన చిరంజీవి సినిమాలను గురించి ప్రస్తావించారు. 'ఇంద్ర' సినిమా వరకూ కూడా చిరంజీవి డైలాగ్స్ గురించి పట్టుబట్టిన దర్శకులు ఎక్కువమంది లేరు .. మేము రాసుకుంటూ వెళ్లినవే పాప్యులర్ అయ్యేవి. 'ఖైదీ' సినిమానే తీసుకుంటే 'పగ కోసం ఈ జన్మ ఎత్తాను .. ప్రేమకోసం మరో జన్మ ఎత్తుతాను' అనే డైలాగ్ ను బాగా రిసీవ్ చేసుకున్నారు.
అలాగే 'గ్యాంగ్ లీడర్' ఉందనుకోండి .. 'అన్నయ్య .. రాముడు సీతను అనుమానించాడు గానీ .. లక్ష్మణుడు అనుమానించలేదురా' అనే డైలాగ్ కి క్లాప్స్ పడ్డాయి. 'ఘరానా మొగుడు' దగ్గరికి వచ్చేసరికి .. 'ఇంపాజిబుల్లా .. ఇస్తరాకుల కట్టా' అనే డైలాగ్ కి వచ్చిన రెస్పాన్స్ ను థియేటర్లో చూసి షాక్ అయ్యాము. 'శంకర్ దాదా' సినిమాలో అయితే 'రోగిని ప్రేమించలేనివాడు కూడా రోగితో సమానం' అనే డైలాగ్ జనంలోకి బాగా వెళ్లింది. 'ఠాగూర్'లో అయితే 'నీ కంఠంలోని నరాలు తెంచి నా బూటుకు లేసులుగా కట్టుకుంటాను" అనే డైలాగ్ నాకే బాగా నచ్చేసింది" అని చెప్పుకొచ్చారు.