modi: కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభిస్తుందని మోదీ హామీ ఇచ్చారు: ఎంపీ వినోద్

  • హైకోర్టు విభజన చేస్తామని హామీ ఇచ్చారు
  • అరుణ్ జైట్లీతో కేసీఆర్ రేపు భేటీ కానున్నారు
  • మోదీకి రెండు అంశాలపై వినతిపత్రాలు

కొత్త జోనల్ విధానంపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. ఢిల్లీలో మోదీతో కేసీఆర్ భేటీ అయిన విషయమై వినోద్ మాట్లాడుతూ, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచనని, మరో రెండుమూడ్రోజుల్లో కొత్త జోనల్ విధానానికి సంబంధించి రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని, హైకోర్టు విభజన చేస్తామని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రేపు మధ్యాహ్నం కేసీఆర్ భేటీ కానున్నట్టు వినోద్ తెలిపారు.

కాగా, కేసీఆర్ తో పాటు సీఎస్ ఎస్.కే.జోషి, ఎంపీ వినోద్ కూడా ఉన్నారు. మోదీకి రెండు అంశాలపై కేసీఆర్ వినతిపత్రాలు అందజేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు త్వరగా ఇవ్వాలని, నాలుగో విడత రావాల్సిన రూ.450 కోట్లను వెంటనే విడుదల చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రుణ పరిమితిని అదనంగా 0.5 శాతం పెంచాలని,14వ ఆర్థిక సంఘం సూచన మేరకు రుణపరిమితి పెంచాలని కేసీఆర్ కోరారు. వరుసగా నాల్గో ఏడాది తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందని, రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులకు భారీగా ఖర్చవుతోందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రుణపరిమితిని పెంచాలని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News