sp balu: ఫ్లూట్ వాయించి ర్యాగింగ్ నుంచి తప్పించుకున్నా!: ఎస్పీ బాలు ఇంజనీరింగ్ అనుభవాలు

  • అనంతపురం జేఎన్టీయూలో చేరిన బాలు
  • కేవలం 8 నెలలే సాగిన చదువు
  • సీనియర్లు వదిలేసేవారని వెల్లడి

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు అందరికీ సుపరిచితమే. దాదాపు 50,000కు పైగా పాటలు పాడిన బాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలు అనంతపురం జేఎన్టీయూలో తన విద్యార్థి జీవితాన్ని గుర్తుచేసుకున్నారు.

సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన తనకు అనంతపురం జేఎన్టీయూలో ఇంజనీరింగ్ సీటు వచ్చిందని బాలు తెలిపారు. అయితే తానక్కడ కేవలం 8 నెలలే చదువుకున్నానని వెల్లడించారు. అప్పట్లో అక్కడ ర్యాగింగ్ బాగా జరిగేదనీ, దాని నుంచి తప్పించుకునేందుకు సంగీతం ఉపయోగపడిందని చెప్పారు.

‘‘నేను కాలేజీలో పాటలు పాడేవాడిని. దీంతో పాటు కొద్దోగొప్పో ఫ్లూట్ వాయించేవాడిని. దీంతో సీనియర్లు ‘వాడిని వదిలేయండిరా’ అని అనేవారు. కాలేజీలో నాకు ఇంకో ఇద్దరు తోడయ్యారు. వారిలో ఒకరు తబలా, ఇంకొకరు బ్యాంజో వాయించేవాళ్లు. దీంతో ఓ చిన్న సంగీత బృందాన్ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేసేవాళ్లం. అలా కాలేజీలో జరిగే ర్యాగింగ్ బారి నుంచి తప్పించుకున్నాం’’ అని తన మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News