Chiranjeevi: అన్నయ్యకు రాఖీ: చెల్లెళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న చిరంజీవి.. వీడియో చూడండి
- చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు
- చిరుకు రాఖీలు కట్టిన మాధవి, విజయ
- ఆశీర్వదించి, కానుకలు ఇచ్చిన అన్నయ్య
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన చెల్లెళ్లు మాధవి, విజయలు రాఖీ కట్టారు. సంప్రదాయ బద్ధంగా తమ అన్నయ్యకు హారతి ఇచ్చి, మిఠాయి తినిపించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తన చెల్లెళ్లకు చిరంజీవి కానుకలు ఇచ్చారు. తన తోబుట్టువులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిరు కోడలు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'ప్రియమైన సోదరీమణులతో మామయ్య రక్షాబంధన్ వేడుకలు' అంటూ ఉపాసన పేర్కొన్నారు.