op rawat: ‘ముందస్తు’ ఎన్నికలపై బయట జరిగే ప్రచారంతో మాకు సంబంధం లేదు: ఈసీ అధికారులు
- ‘ముందస్తు’ గురించి ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు
- ఎవరైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి వస్తే ముందుకెళతాం
- ఎన్నికల నిర్వహణ నియమావళి మేరకు ఉంటుంది
‘ముందస్తు’ ఎన్నికలపై బయట జరిగే ప్రచారంతో తమకు సంబంధం లేదని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల గురించి ఎవరూ తమను సంప్రదించలేదని, ఎవరైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి వస్తే నిబంధనల మేరకు ముందుకు వెళతామని, ఎన్నికల నిర్వహణ నియమావళికి అనుగుణంగా ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉండగా, జాతీయ, రాష్ట్రీయ రాజకీయ పార్టీలతో ఈ రోజు ఏర్పాటు చేసిన ఈసీ సమావేశం ముగిసింది. అనంతరం, ప్రధాన ఎన్నికల కమీషనర్ ఓపీ రావత్ మీడియాతో మాట్లాడుతూ, ఈవీఎంలు, వీవీపాట్ లపై కొన్ని పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తాయని, మళ్లీ బ్యాలెట్ పద్ధతికి వెళితే అక్రమాలు జరుగుతాయని మరికొన్ని పార్టీలు అభిప్రాయపడ్డాయని అన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీలు కొన్ని విలువైన సూచనలు చేశాయని, ఎన్నికల్లో పారదర్శకత పెరిగేందుకు పార్టీల సూచనలు అమలు చేస్తామని చెప్పారు.