record: ఢిల్లీలో రికార్డు స్థాయికి చేరుకున్న డీజిల్ ధర.. వాహనదారుల గుండెలు గుభేల్!
- లీటర్ డీజిల్ ధర రూ.69.46
- మే తర్వాత ఇదే అత్యధికం
- ముంబైలో రూ.73.74
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.69.46కు చేరుకుంది. మరోవైపు పెట్రోలు ధర కూడా లీటర్కు రూ.78కు చేరుకుని వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టించింది. ప్రభుత్వం రంగ చమురు సంస్థల ప్రకారం సోమవారం డీజిల్ ధర రూ.14 పైసలు పెరగ్గా, పెట్రోలు ధర రూ.13 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో చరిత్రలోనే తొలిసారి డీజిల్ అత్యధిక ధరకు చేరుకుంది. కాగా, ముంబైలో లీటర్ డీజిల్ ధర ప్రస్తుతం రూ.73.74గా ఉంది.
ఢిల్లీలో సేల్స్ ట్యాక్స్, వ్యాట్ చాలా తక్కువగా ఉండడంతో దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ధర చాలా తక్కువగా ఉంటుంది. కాగా, ఈ ఏడాది మే 29న ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.69.31కి చేరుకుంది. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా, తాజాగా రూ.69.46కు చేరుకుని దానిని అధిగమించింది.