harikrishna: హరికృష్ణ మృతికి కారణాలు ఇవే: నల్గొండ ఎస్పీ రంగనాథ్
- అతి వేగమే ప్రమాదానికి కారణం
- ప్రమాద సమయంలో 160 కి.మీ. స్పీడుతో కారు వెళ్తోంది
- సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ప్రమాద తీవ్రత తగ్గేది
టీడీపీ నేత, సినీ నటుడు హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలను జిల్లా ఎస్పీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ఆయన తెలిపారు. ప్రమాద సమయంలో కారు 160 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని చెప్పారు. సీటు బెల్టు పెట్టుకుని ఉంటే... ప్రమాద తీవ్రత తగ్గేదని అన్నారు. వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరగడంతోనే వాహనం అదుపు తప్పిందని తెలిపారు. డివైడర్ ను ఢీకొన్న కారు... 15 మీటర్ల దూరంలో ఎగిరి పడిందని చెప్పారు.
ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాదు నుంచి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో... ఈ ప్రమాదం సంభవించింది. కారులో నుంచి బయటకు ఎగరి పడ్డ హరికృష్ణ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆయన తుదిశ్వాస విడిచారు.