hari krishna: హరికృష్ణ లేకపోతే ‘బొమ్మరిల్లు’ సంస్థ లేదు: దర్శకుడు వైవీఎస్ చౌదరి
- అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటి నుంచి నన్ను ఆదరించారు
- హరికృష్ణ నన్ను ఓ సోదరుడిలా చూసే వారు
- ఆయన లేని లోటు పూడ్చలేనిది
నందమూరి అంగీకారంతోనే బొమ్మరిల్లు సంస్థ పుట్టిందని, ఆయన లేకపోతే ఈ సంస్థే లేదని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, హరికృష్ణతో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి తనను నిలబెట్టారని, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తనను ఆదరించి, అభిమానించిన వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు.
హరికృష్ణ తనను ఓ సోదరుడిలా చూసే వారని, ఆయనతో తనకు ఎంతో ఆత్మీయత, అనుబంధం ఉన్నాయని అన్నారు. తాను వాళ్ల కుటుంబసభ్యుడినేమోననే అంత అనుబంధం ఆయనతో ఉందని, హరికృష్ణను తాము ‘టైగర్’ అని పిలుచుకునేవాళ్లమని చెప్పుకొచ్చారు. హరికృష్ణ లేని లోటు పూడ్చలేనిదని వైవీఎస్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.