NDA: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీహార్ లో సీట్ల సర్దుబాటు చేసిన ఎన్డీఏ!

  • బీజేపీకి 20, జేడీ(యూ)కి 12 స్థానాల కేటాయింపు
  • 5 స్థానాల నుంచి పోటీ చేయనున్న లోక్ జనశక్తి పార్టీ 
  • వెల్లడించిన ఎన్డీఏ వర్గాలు

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీహార్, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సీట్ల సర్దుబాటు ఖరారైంది. బీహార్ లో బీజేపీ 20, జేడీ(యూ) 12, లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) కనుక పోటీ చేస్తే ఆ పార్టీకి బీహార్ లో రెండు సీట్లు కేటాయించేలా అంగీకారం కుదిరినట్టు తెలిసింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, ఆర్ఎల్ఎస్పీ అధినేత ఉపేంద్ర కుష్వాహ మాట్లాడుతూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బీజేపీ సీట్ల సర్దుబాటులో భాగంగా యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో సీటును జేడీ(యూ)కు ఇవ్వనున్నట్టు ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News