Nita Ambani: కేరళకు భారీ ఆర్థిక సాయం అందించిన నీతా అంబానీ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన!
- రూ.21 కోట్ల ఆర్థిక సాయం
- ఆహారం, ఇతర సహాయ కార్యక్రమాల కోసం రూ.50 కోట్లు
- వరద ప్రభావిత ప్రాంతంలో నీతా అంబానీ పర్యటన
జల విలయంతో అల్లాడిపోయిన కేరళను ఆదుకునేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. ఏకంగా రూ.71 కోట్లను విరాళంగా ప్రకటించింది. ఇందులో రూ.21 కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించగా, సహాయ సామగ్రి, ఆహార పదార్థాల కోసం రూ.50 కోట్లను ప్రకటించారు. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిసి చెక్ అందించారు. అంతకుముందు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన అలప్పుజా జిల్లాలోని పల్లిపాడ్ గ్రామాన్ని నీతా అంబానీ సందర్శించారు.
కేరళ వరదల్లో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు వివిధ రాష్ట్రప్రభుత్వాలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చారు. ఆర్థిక సాయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.