lalu prasad yadav: లాలూ ప్రసాద్ భార్య, కుమారుడికి ఊరట!
- ఐఆర్సీటీసీ కుంభకోణంలో బెయిల్ మంజూరు
- కోర్టుకు హాజరు కాలేని లాలూ
- తదుపరి విచారణ సెప్టెంబర్ 6కు వాయిదా
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ లకు స్వల్ప ఊరట లభించింది. వీరితో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరికీ పటియాలా హౌస్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. తలో లక్ష రూపాయల షూరిటీ కింద బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. రాంచీలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో లూలూ కోర్టుకు హాజరుకాలేదు.
లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో... 2005లో రాంచీ, పూరీలో ఉన్న రెండు ఐఆర్సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్టు సీబీఐ వాదిస్తోంది. ఈ హోటల్ యజమానులు లాలూ కుటుంబానికి అత్యంత సన్నిహితులని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే లాలూ కుటుంబసభ్యులతో పాటు రైల్వే అధికారులపై కూడా చార్జిషీటు దాఖలు చేసింది.