India: రుణాలపై వడ్డీ రేట్లను పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
- 0.2 శాతం మేరకు పెరిగిన వడ్డీ
- భారం కానున్న గృహ, వాహన రుణాలు
- తక్షణమే అమలులోకి రానున్న పెంచిన వడ్డీ
ఇండియాలో అతిపెద్ద బ్యాంకింగ్ సేవల సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), తన ఖాతాదారులకు ఇచ్చిన రుణాలపై వడ్డీని పెంచుతున్నట్టు ప్రకటించింది. బ్యాంకు నుంచి తీసుకున్న గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై భారం పడేలా, 0.2 శాతం మేరకు వడ్డీని ఎస్బీఐ అధికారులు ప్రకటించారు. పెంచిన రేట్లు తక్షణమే అమలులోకి వస్తాయని అన్నారు.
కాగా, గత సంవత్సరం ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 8.25 శాతం నుంచి 8.45 శాతానికి పెంచుతూ బ్యాంకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టులో సమావేశమైన రిజర్వ్ బ్యాంక్, తన ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచగా, ఆ ప్రభావం బ్యాంకు ఆదాయంపై చూపుతుండటంతో, నష్ట నివారణ నిమిత్తమే బ్యాంకు వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.