Petrol: పెట్రో ధరల పెంపు కొనసాగుతుంది... బాంబు పేల్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్!
- అగస్టు 16 నుంచి పెరుగుతున్న ధరలు
- మరింతగా పెరగనున్నాయన్న ధర్మేంద్ర ప్రధాన్
- క్రూడాయిల్, పడిపోతున్న రూపాయే కారణం
ఆగస్టు 16 నుంచి విరామం లేకుండా పెరుగుతూ వస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తుతుంటే, కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరో బాంబేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరుగుతూ ఉన్న క్రూడాయిల్ ధరలు, డాలర్ తో రూపాయి మారకం విలువ పతనం తదితరాల కారణంగా ఇంధన ధరలు మరింతగా పెరగనున్నాయని ఆయన అన్నారు.
వివిధ అంతర్జాతీయ అంశాలు పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, నిన్న ఆల్ టైమ్ రికార్డుకు చేరిన పెట్రోలు, డీజిల్ ధరలు నేడు మరింతగా పెరిగాయి. ఆదివారం నాడు హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 17 పైసలు పెరిగి రూ. 83.59కి చేరింది. డాలర్ తో రూపాయి విలువ రూ. 71 పైన కొనసాగుతోంది.