pragati nivedana sabha: చిత్రవిచిత్ర వేషధారణలో టీఆర్ఎస్ శ్రేణులు.. కేసీఆర్ వాచ్, బొట్టు, లాకెట్ తో హాజరైన కార్యకర్త!

  • సభాస్థలికి పోటెత్తున్న కార్యకర్తలు
  • విచిత్ర వేషాధారణలో మహిళా కార్యకర్త హాజరు
  • కేసీఆర్ పై అభిమానంతోనే వచ్చినట్లు వెల్లడి

రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ లో జరుగుతున్న ‘ప్రగతి నివేదన సభ’కు రాష్ట్రం నలుమూలల నుంచీ భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇక్కడికి చేరుకున్న ప్రజలను కళాకారులు వేర్వేరు సాంప్రదాయ నృత్యాలతో అలరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు చిత్ర, విచిత్ర వేషధారణలో సభాస్థలికి చేరుకుంటున్నారు. వీరిలో గోషామహల్ నుంచి టీఆర్ఎస్ కార్యకర్త శీలం సరస్వతి విచిత్రమైన వేషధారణతో కొంగరకలాన్ కు చేరుకున్నారు.

కేసీఆర్, కవిత ఫొటోలు ఉన్న టోపీతో పాటు లాకెట్, వాచ్, ఉంగరం, చెవి కమ్మలు, బొట్టు, ప్రత్యేకమైన బంతుల హారాన్ని ధరించి ఆమె సభాస్థలి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా సరస్వతి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. తమ నియోజకవర్గం నుంచి 10,000 మంది వస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్ పై అభిమానంతోనే ఈ రకమైన వేషధారణతో వచ్చినట్లు పేర్కొన్నారు. అభిమానాన్ని వెరైటీగా చాటాలనే ఇలా సభకు వచ్చానని తెలిపారు.

  • Loading...

More Telugu News