kcr: ఈ సభను చూస్తుంటే 18 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి: కేసీఆర్
- అప్పటి సీఎం కరెంటు చార్జీలు పెంచి, తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు
- ప్రజలకు అన్యాయం చేయవద్దని తాను లేఖ రాసినా, పట్టించుకోలేదు
- తెలంగాణ ఉద్యమానికి అప్పుడే బీజం పడింది
ప్రపంచమే నివ్వెరపోయేలా ప్రగతి నివేదన సభ ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సభను చూస్తుంటే తనకు 18 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి కరెంటు చార్జీలను పెంచి, తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేశారని... ఆ సందర్భంగా తాను అప్పటి ముఖ్యమంత్రికి లేఖ రాశానని, ప్రజలకు అన్యాయం చేయవద్దని కోరానని చెప్పారు.
కానీ, ఆనాటి వలస పాలకులకు తెలంగాణ ప్రజలంటే ఎంతో అలుసని, అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన పాత్రను పోషిస్తున్న అప్పటి సీఎం తన మాటను పట్టించుకోలేదని... అప్పుడే తెలంగాణ కోసం తాను ఆలోచించడం మొదలు పెట్టానని తెలిపారు. తన తెలంగాణ ఉద్యమానికి అప్పటి ఘటనే బీజం వేసిందని చెప్పారు. ఉద్యమబాటను వీడనని, మడమ తిప్పనని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు.