kcr: ఎన్నోసార్లు భావోద్వేగానికి గురయ్యా.. ఒక రోజు రాత్రి ఏడ్చేశా!: కేసీఆర్
- సమైక్య పాలకుల హయాంలో జీవన విధ్వంసం జరిగింది
- కులవృత్తులన్నీ నాశనం అయ్యాయి
- చేనేత కార్మికుల బాధలు చూడలేక కుమిలికుమిలి ఏడ్చాను
సమైక్య పాలకుల హయాంలో తెలంగాణలో జీవన విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కులవృత్తులన్నీ నాశనమయ్యాయని, వాటిని నమ్ముకున్న వారి బాధ వర్ణనాతీతమని చెప్పారు. వీటిని చూస్తూ తాను ఎన్నోసార్లు భావోద్వేగానికి గురయ్యానని, ఒక రాత్రి 2 గంటల సమయంలో ఏడ్చేశానని గుర్తు చేసుకున్నారు.
కరీంనగర్ జిల్లా పర్యటన చేసి హైదరాబాదుకు తిరిగి వస్తున్నప్పుడు... సిరిసిల్లలో అక్కడి జిల్లా కలెక్టర్ చేనేత కార్మికులను ఆత్మహత్యకు పాల్పడవద్దని చెబుతుంటే, వారి బాధలను చూడలేక కుమిలికుమిలి ఏడ్చానని చెప్పారు. 'నేతన్నలారా, ఆత్మహత్యలకు పాల్పడకండి, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతా'యని అప్పట్లో తాను చెప్పానని అన్నారు.