Tech-News: ఆకట్టుకునే ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్ లని విడుదల చేసిన మోటోరోలా!
- బెర్లిన్ లో విడుదల
- 'మోటోరోలా వన్ పవర్' ఫోన్ ధర సుమారుగా రూ.14000
- 'మోటోరోలా వన్' ఫోన్ ధర సుమారుగా రూ.24800
మోటోరోలా అనుబంధ సంస్థ లెనోవా నుండి రెండు స్మార్ట్‌ఫోన్ లు విడుదల అయ్యాయి. 'మోటోరోలా వన్', 'మోటోరోలా వన్ పవర్' పేరిట బెర్లిన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ వీటిని లాంచ్ చేసింది. మోటోరోలా వన్ పవర్ లో 4850 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ తో పాటు 6.2" ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే గల టచ్ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు.
అలాగే, మోటోరోలా వన్ లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ తో పాటు 5.9" డిస్ప్లే గల టచ్ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. కాగా, వచ్చే నెలలోనే భారత మార్కెట్లోకి రానున్న 'మోటోరోలా వన్ పవర్' సుమారుగా రూ.14000 ధరకి లభించనుండగా, మోటోరోలా వన్ హైఎండ్ ఫీచర్ ఫోన్ ధర సుమారుగా రూ.24800గా ఉండే అవకాశం ఉంది.
మోటోరోలా వన్ పవర్ ప్రత్యేకతలు:
- వెనక భాగంలో రెండు 16/5 మెగాపిక్సల్ కెమెరాలు
- ముందు భాగంలో 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 6.2" ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4850ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్)
మోటోరోలా వన్ ప్రత్యేకతలు:
- 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ('ఆండ్రాయిడ్ 9.0 పై' కి అప్‌గ్రేడ్ చేసుకునే సౌకర్యం)
- వెనక భాగంలో రెండు 13/2 మెగాపిక్సల్ కెమెరాలు
- ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
- 5.9 ఇంచ్ డిస్ప్లే
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3000ఎంఏహెచ్ బ్యాటరీ