KCR: ఏకవాక్య తీర్మానం ద్వారా అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయనున్న కేసీఆర్ క్యాబినెట్!
- అందరూ అందుబాటులో ఉండండి
- ఏమైనా ప్రారంభోత్సవాలు ఉంటే నేడే చేసుకోండి
- మంత్రులు, నేతలకు వెళ్లిన ఆదేశాలు
రేపు ఉదయానికి అందరు మంత్రులూ హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి. ఉదయాన్నే మంత్రి వర్గం సమావేశం కావాలన్న నిర్ణయం జరిగిపోయింది. తెలంగాణ అసెంబ్లీ రద్దే ఈ క్యాబినెట్ మీటింగ్ ప్రధాన అజెండాగా తెలుస్తోంది. ఇక ఏకవాక్య తీర్మానం ద్వారా అసెంబ్లీని రద్దుకు సిఫార్సు చేస్తున్నట్టు ప్రకటించి, దాన్ని కేసీఆర్ స్వయంగా తీసుకెళ్లి గవర్నర్ కు అందిస్తారని తెలుస్తోంది.
అసెంబ్లీ రద్దయిన వెంటనే ఆపద్ధర్మ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి, ఏవైనా అధికారిక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటే నేడే చేసుకోవాలని కేసీఆర్ నుంచి మంత్రులకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. ఆపై మరుసటి రోజే, ఎన్నికల సమర శంఖారావాన్ని హుస్నాబాద్ లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు.