stock market: వరుసగా ఆరో రోజు.. బేర్ మన్న మార్కెట్లు!
- ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బ తీస్తున్న రూపాయి విలువ
- అమ్మకాలకు మొగ్గు చూపుతున్న మదుపరులు
- 140 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడంతో పాటు డాలరుతో మన రూపాయి విలువ పతనమవుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తోంది. జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ ఈ రోజు 23 పైసల మేర పుంజుకున్నప్పటికీ... ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 140 పాయింట్లు కోల్పోయి 38,018కు పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 11,476కు చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ముత్తూట్ ఫైనాన్స్ (9.41%), అడ్వాన్స్ డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ (8.40%), అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ (5.67%), రిలయన్స్ ఇన్ఫ్రా (5.50%), సియంట్ లిమిటెడ్ (5.33%).
టాప్ లూజర్స్:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (-13.34%), శంకర బిల్డింగ్ ప్రాడక్ట్స్ (-6.68%), ఇంజినీర్స్ ఇండియా (-5.83%), వీఐపీ ఇండస్ట్రీస్ (-4.80%), క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (-4.77%).